AP ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు(AP High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ జీవో ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆరోపిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, టీడీపీ నేతలు వర్ల రామయ్య(Varla Ramaiah), కొల్లు రవీంద్ర(Kollu Ravindra)లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. జీవో నెం.1ని కొట్టివేసింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు(AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందన్న హైకోర్టు అభిప్రాయపడింది. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని న్యాయవాది వాదించారు. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారన్న న్యాయవాది కోర్టులో వాదించారు.

- Advertisement -
Read Also: ఎలన్ మస్క్ సంచలన ప్రకటన

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...