వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) ఏపీ హై కోర్ట్ లో చుక్కెదురయ్యింది. వంశీ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను కోర్ట్ కొట్టేసింది. గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో వంశీ అరెస్టైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
టీడీపీ ఆఫీస్(TDP Office) కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్(Satyavardhan) చేసిన ఫిర్యాదుతో వంశీతో పాటు మరో 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదైంది. కేసు విచారణలో ఉండగా.. సత్యవర్ధన్ ను వంశీ(Vallabhaneni Vamsi) అనుచరులు బెదిరింపులకు పాల్పడి, కిడ్నాప్ చేసిన కేసులో వంశీ ని రిమాండ్ పై పోలీసులు జైలుకు పంపారు. అరెస్ట్ ముందే ముందస్తు బెయిల్(Anticipatory Bail) కు అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది.