ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు(AP High Court) భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఈడబ్ల్యూఎస్ జీవోపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ జీవోను ఛాలెంజ్ చేస్తూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ జీవోపై స్టే విధిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు నిర్ణయంతో 2024-25 విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ లేనట్లే అని నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన పద్దతి పాటించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే అన్ని వైద్య విద్య కళాశాలల్లోని సీట్ల భర్తీలో 10 శాతం సీట్లను ఈ డబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తోసిపుచ్చారు. ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని, జీవోను ఎలా ఇస్తారని విద్యార్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని వెంటనే నిలిపివేయాలని వారు కోరారు. వారి పిటిషన్‌పై జరిగిన విచారణలో.. సీట్ల సంఖ్య పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేయాలని, లేని పక్షంలో ఓపెన్ కేటగిరీ వాళ్లు తీవ్రంగా నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్. వారి వాదనలు విన్న అనంతరం జీవోపై AP High Court స్టే విధించింది న్యాయస్థానం.