ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శుక్రవారం విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్టియర్, సెకండీయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లుపూర్తి చేశారు. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది.
AP Inter Results | రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, సెకండియర్ పరీక్షలకు 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులే ఈ ఏడాది ఫలితాలను ప్రకటించనున్నారు.