AP Inter, SSC Exams Schedule to be Released | ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విడుదల చేశారు. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ప్రకటించారు.
ఇక మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు(AP Inter Exams) నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజు మార్చి రోజు ఫస్టియర్, సెంకడియర్ పరీక్షలు ఉంటాయని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షా సమయం అని తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి సుమారు 16 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారని చెప్పకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని బొత్స వెల్లడించారు.