AP Liquor License | ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల జారీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ లైసెన్సుల జారీని అధికారులు లాటరీ పద్దతిలో చేపడుతున్నారు. 26 జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి ఈ లాటరీ పద్దతిని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇది కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. గెజిట్‌లో ప్రచురించిన మద్యం దుకాణాల క్రమసంఖ్య ప్రకారమే ఈ లాటరీ తీయడం జరుగుతోంది. ఈ లాటరీ తీసే ప్రక్రియ మొత్తం కూడా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు గానూ 89,882 దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.
AP Liquor License | మొత్తం 26 జిల్లాలకు సంబంధించి ఈ లాటరీ ప్రక్రియ జరుగుతుండగా వీటిలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 40 దుకాణాలకు లైసెన్లు జారీ ప్రక్రియ జరుగుతోంది. అత్యధికంగా తిరుపతిలో 227 దుకాణాలను అధికారులు నోటిఫై చేశారు. వీటితో పాటు పలు ఇతర జిల్లాల్లో కూడా అంతంతమాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి. అక్కడి ముఖ్యనేతలు ఇతరుల చేత దరఖాస్తులు వేయనీయకుండా అడ్డుకోవడం, మరికొన్ని చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారడమే ఇందుకు కారణం. తాడిపత్రి, కమలాపురం వంటి నియోజకవర్గాల్లో ఒక్కో దుకాణానికి రెండు, మూడు దరఖాస్తులే వచ్చాయి.