AP Liquor Sales | ఏపీలో మందుబాబులు రికార్డు సృష్టించారు. భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్ళు జరిపారు. 75 రోజుల్లో రూ.6,312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 16 నుంచి కొత్త వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. రూ.26 లక్షల 78 వేల 547 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. రూ.83 లక్షల 74 వేల 116 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడిస్తోంది.
AP Liquor Sales | మరోవైపు డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపుల్లో ప్రీమియం బ్రాండులు నింపేస్తున్నారు. న్యూ ఇయర్ కి నో స్టాక్ బోర్డులు లేకుండా సరుకు దింపుతున్నారు. కాగా, ఈ మూడు నెలల్లో యావరేజ్ గా రూ.250 కోట్ల లిక్కర్ సేల్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే రేపు ఒక్కరోజే రూ.15 కోట్ల అమ్మకాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఓపెన్ రేవ్ పార్టీలు పెట్టినా, అక్రమ మద్యం అమ్మకాలు జరిపినా కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.