మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట తీవ్ర విషాదం 

-

AP Minister Adimulapu Suresh mother passed away: ఏపీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఆదిమూలపు థెరీసమ్మ కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

ఆదిమూలపు సురేష్‌ తల్లి మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan), సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. థెరీసమ్మకు ఐదుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు. అందులో మంత్రి సురేష్ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యా సంస్థల కార్యదర్శిగా కొనసాగుతున్నారు. థెరీసమ్మ మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా పని చేశారు.

ఉపాధ్యాయురాలిగా థెరీసమ్మ విశేష సేవలు అందించారు.  కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అనేక విద్యాసంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.  థెరీసమ్మ మృతితో కర్నూలు,  ప్రకాశం జిల్లాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also:
ఆసుపత్రిలో చేరిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...