టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైసీపీకి చుక్కెదురైంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టును కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీసీ నేతలు, కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారికి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా న్యాయస్థానం నిరాకించింది. ఇంతలోనే హైదరాబాద్ మియాపూర్‌లో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh)ను ఏపీ పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే హైకోర్టులో వైసీసీ నేతలకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడటంతో వైసీపీ నేతల అరెస్ట్‌కు ఏపీ పోలీసులు సిన్నద్దమయ్యారు. ఇందులో భాగంగానే సందిగం సురేష్‌ను అరెస్ట్ చేయడానికి ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాలు పోలీసులు అక్కడే వేచి చూశారు. సురేష్ ఇంట్లో లేరని నిర్ధారించుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు సురేష్.. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో ఇక్కడకు చేరుకుని పక్కాసమాచారంతో సురేష్(Nandigam Suresh)ను అరెస్ట్ చేశారు.