RGV | రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కు అంతా సిద్ధం..!

-

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV)ను అరెస్ట్ చేయడానికి ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆర్‌జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన రాకపోవడంతో పోలీసులే ఆర్టీవీ ఇంటికి వచ్చారు. దీంతో ఆయన అరెస్ట్ తథ్యమన్న వాతావరణం కనిపిస్తోంది. మరి దీని నుంచి ఆర్‌జీవీ ఎలా గట్టెక్కుతారో చూడాలి. నవంబర్ 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ్ వెళ్లలేదు. విచారణకు డుమ్మా కొట్టింది కాక.. నాలుగు రోజుల సమయం కోరుతూ ఒంగోలు పోలీసులకు వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. సినిమా బిజీలో ఉండటం వల్ల రాలేకపోతున్నానని వివరించాడు. ఆ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు కూడా విచారణకు గైర్హాజరవడంతో ఆర్‌జీవీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రెడీ అయ్యారు.

- Advertisement -

అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారని, వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య.. పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆర్‌జీవీ(RGV)కి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని తెలిపారు.

Read Also: డస్ట్ అలెర్జీ ఇబ్బంది పెడుతుందా..? ఈ చిట్కాలు మీకోసమే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...