AP Police recruitment : ఏపీలో పోలీసు కొలువుల జాతర

-

AP Police recruitment will be announced soon: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల జాబ్‌ కోసం సన్నధం అవుతున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అతి త్వరలో పెద్ద సంఖ్యలో పోలీసు కొలువులు భర్తీ చేయనుంది. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ప్రతి సంవత్సరం 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు, ఆశాఖ అధికారులు కసరత్తులు ప్రారంభించారు. 6,511 పోస్టులు (AP Police recruitment) భర్తీకి నోటిఫికేషన్‌ చేయగా.. డిసెంబర్‌ నాటికి దరఖాస్తు స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎస్సై (సివిల్)- 387, ఎస్సై (ఏపీఎస్పీ) – 96, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)- 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలియన్)- 2,520 భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...