AP Rain Alert: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు

-

AP Rain Alert on november 21st and 22nd: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఎర్పడటంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం చెన్నై తీరానికి 670 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని.. నెమ్మదిగా వాయుగుండం 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఎర్పడిన ద్రోణి ప్రభావంతో(21, 22తేదీల్లో) సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...