AP Schools |ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 07.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతుల నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఉదయం 08:30 నుంచి 09:00 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయాలని సూచించింది. రాష్ట్రంలో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతోఒంటిపూట బడుల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని సెలవుల పొడిగింపుపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
-