Tammineni Sitaram: ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలి

-

Ap speaker Tammineni Sitaram comments on vishaka capital ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రౌండేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం నాడు ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయన్ని జగన్ తీసుకున్నారని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కావడం ఉత్తరాంధ్ర కల అని.. భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాట్టు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అమరావతి ఏర్పాటు కోసం 30వేల ఎకరాలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని విమర్శించారు. ఫాల్స్ ప్రెస్టేజ్‌కు పోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఇందుకోసం కలసిరావాలని తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) పిలుపునిచ్చారు.

- Advertisement -

Read also: Etela Rajender:పక్కా స్కెచ్‌తోనే నాపై దాడి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...