ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results) విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యూలర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574(86.69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 84.32శాతం, బాలికలు 89.17శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 7లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
AP SSC Results | వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకు పైగా ఉన్నారు. ఇందులో బాలురు 3,17,939.. బాలికల సంఖ్య 3,05,153గా ఉంది. మొత్తం 3,473 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలవగా.. కర్నూలు జిల్లాలో 62.47 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయి చివరి స్థానంలో నిలిచింది.