మద్యం పాలసీపై ఫుల్ ఫోకస్.. అందుకే కొత్త పాలసీ

-

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ తీసుకురావడంపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నూతన మద్యం పాలసి రూపకల్పన కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ సబ్ కమిటీని కూడా సిద్ధం చేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీ విధివిధానాలను సదరు కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తమ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించనుంది. ఇందులో భాగంగానే దాదాపు ఆరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం పాలసీ, అక్కడ జరుగుతున్న మద్యం విక్రయ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు సీఎం చంద్రబాబుకు తమ నివేదికను అందించింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్‌లో సీఎంతో సమావేశామయ్యారు. సీఎంతో సమావేశం పూర్తయిన అనంతరం వారు భేటి సారాంశాన్ని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. ప్రజలను నిలువునా ముంచారంటూ విమర్శలు గుప్పించారు. నిషేధం తర్వాత సొంత బ్రాండ్లను షాపుల్లో పెట్టి, వాటితో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చిన లాభాలతో గత ప్రభుత్వ నేతలు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్యం పాలసీని తమ జేబులు నింపుకోవడానికే వినియోగించుకుందని, కానీ ప్రజల ఆరోగ్యం గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం నాసిరకం మద్యం అందుబాటులో ఉంచడం వల్లే ప్రజలు మళ్ళీ నాటు సారా వైపు మొగ్గు చూపారాని క్యాబినెట్ సబ్ కమిటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దానిని మార్చాలన్న ఉద్దేశంతో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పాలసీ రూపకల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని సబ్ కమిటీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌పై ప్రభుత్వం క్లారిటీ

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల(Family Digital Cards) దరఖాస్తు కోసం ప్రభుత్వం...

‘ఆ విజయం మనకు స్ఫూర్తి’.. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) కీలక...