జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గ రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు(Nagababu) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సీఎం అయితే ఏపీకి స్వర్ణయగమే అని అన్నారు. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, స్వర్ణయుగం వస్తుంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం.. రాష్ట్రంలో రానున్నది జనసేన(Janasena) ప్రభుత్వమే. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీ(YCP)ని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి పవన్‌కి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నది’ అని వ్యాఖ్యానించారు.
Read Also: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ
Follow us on: Google News, Koo, Twitter