YS Sharmila | ఏపీ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి – అభూత కల్పన. దశ – దిశ లేని.. పస లేని బడ్జెట్‌ అంటూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) విమర్శలు గుప్పించారు. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. ఇతర హామీలకు ఎగనామం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యింది.

- Advertisement -

సూపర్‌ సిక్స్‌ – సూపర్‌ ఫ్లాప్‌. అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనే. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ముష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే. తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారు.

రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది రూ.12,600 కోట్లు అయితే.. రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు రూ.3వేల కోట్ల మేర విద్యార్థుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా? అంటూ ప్రశ్నించారు. దీపం 2 పథకానికి ఏడాదికి అవసరం అయిన నిధులు సంఖ్య రూ.4500 కోట్లు. బడ్జెట్‌లో ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయింపులు రూ.2601 కోట్లు. కోటిన్నర లబ్ధిదారులు ఉండగా సగం మేర కోత పెట్టదలుచుకున్నారా ? అంటూ నిలదీశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌ లో నెలకు రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదు. నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారు. కోటిన్నర మంది మహిళలను అన్యాయం చేశారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్‌ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులను వంచించారు. రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసి పూసి మారేడు కాయ చేశారు. ఈ బడ్జెట్‌లో విజన్‌ లేదు. విజ్‌డమ్‌ అంతకన్నా లేదని, కేవలం ఇంద్రజాలమే అని, మిషన్‌ లేదు మీనింగ్‌ లేదు కేవలం మహేంద్రజాలమే అని YS Sharmila ఎద్దేవా చేశారు.

Read Also: కిషన్ రెడ్డి.. తెలంగాణకు సైంధవుడిలా తయారయ్యారు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...