Bhumana Karunakar Reddy: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఈనెల 29న ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాయలసీమ గొంతును మహా ప్రదర్శన ద్వారా చాటిచేబుదాం. రాయలసీమకు న్యాయ రాజధాని కావాలి… అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది.’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకపడ్డాయని.. అందుకే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. జగన్ తీసుకున్న మంచి నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
- Advertisement -
Read also: సీఎంకు సోము వీర్రాజు బహిరంగ లేఖ