Avanthi Srinivas call recording leak: వైసీపీ నేతల వరుస కాల్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ లీకులు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు సంబంధించిన మరో కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “ లవ్ యూ బంగారం.. ఐ లవ్ యూ డార్లింగ్.. నీతో మాట్లాడి ఎన్నాళ్లైందో, ముందు నీ ఫోటో పంపు.. నాలుగో తేదీన ఢిల్లీలో కలుద్దామా” అంటూ అవంతి శ్రీనివాస్ స్వరంతో ఉన్న కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ స్వరం అవంతి శ్రీనివాస్‌దేనంటూ.. పలు ప్రముఖ ఛానెళ్లు, బ్రేకింగ్ న్యూస్ అంటూ, ఆయన ఫోటోలతో సహా కథనాలు ప్రసారం చేశాయి.
సదరు మహిళ తాను హైదరాబాద్‌లోని ప్రియాంక రెసిడెన్సీలోకి ఇల్లు మారుతున్నానని చెప్పగా.. తన కుమార్తె చాలా షార్ప్ అనీ.. తను పసిగట్టేస్తుందని ఇవతలి వ్యక్తి అన్నాడు. గతంలో ఇదే విధంగా అవంతి శ్రీనివాస్ కాల్ రికార్డింగ్ అంటూ ఓ మహిళతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు ఉన్న ఓ ఆడియో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చర్చానీయాంశంగా మారింది..
అవంతి పీఏ సదరు కాల్ రికార్డింగ్‌పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై స్వరాన్ని పోలిన సంభాషణలు ఈ విధంగా విడుదల చేశారనీ.. తన రాజకీయ భవిష్యత్తు, కీర్తి ప్రతిష్టలను నాశనం చేయటానికే అని అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అయ్యప్పమాలలో ఉన్నాననీ.. పది రోజుల కిందటే కాల్ రికార్డింగ్ తన దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు.