వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈనెల 25వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటివరకు రోజూ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డికి తెలిపింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని పేర్కొంది. ఈనెల 25వ తేదిన బెయిల్ పై తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి. ఒకనొక దశలో సునీత, అవినాశ్(Avinash Reddy) లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో ఇప్పుటికే అరెస్టు అయిన భాస్కరరెడ్డి(YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy)లను 6రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి ఈ నెల 24వరకు ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నించనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది.
Read Also: పేదలుగా మారిన భారత దిగ్గజ వ్యాపారవేత్తలు వీరే!!
Follow us on: Google News, Koo, Twitter