జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

-

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజూ ఈ హత్య గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇది నీకు తగునా అంటూ సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా సౌభాగ్యమ్మ లేఖకు కౌంటర్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మీ బహిరంగా లేఖ రాశారు.

- Advertisement -

“అమ్మా సౌభాగ్యమ్మ.. 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు గుర్తుకు వస్తుందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్న చూపు చూసినప్పుడు అండగా నిలిచి పెద్దదిక్కుగా ఉండాల్సిన మీరు వ్యక్తిగత స్వార్థాలు చూసుకున్నారు.. జగన్‌ను ఒంటరిని చేసినప్పుడు ఆయన పడ్డ బాధ గుర్తుకు రాలేదా.. 2011లో సునీత, ఆమె భర్తతో కలిసి విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన గురించి ఒక్కసారి కూడా అర్థం కాలేదా?

వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతారు.. మాటిమాటికి హంతకుడంటూ తీవ్రమైన పదజాలంతో అవినాశ్ రెడ్డిని కించపరచడం సరికాదు…ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరే ఓ వ్యక్తిని హంతకుడిగా ఎలా నిర్ణయిస్తారు…అలా అసత్య ఆరోపణలు చేయడం తప్పనిపించడం లేదా? నీ కుమార్తె సునీతను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు.. వారు మాట్లాడుతున్న మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం..

న్యాయం కోసం పోరాటం చేస్తే జగన్ పూర్తి మద్దతు సునీతకు ఉంటుంది.. కానీ వైఎస్ఆర్, జగన్ శత్రువుల చేతిలో కీలు బొమ్మలుగా మారి అన్యాయంగా సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే మద్ధతు ఎలా ఇస్తారు. ఇప్పటికైనా శత్రువుల చెంత నుంచి బయటకు రావాలి.. తప్పు తెలుసుకుని నిజమైన న్యాయం కోసం పోరాటం చేయాలి.. అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఎంత బాధ, ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. ఏదో ఒకరోజు తప్పకుండా బయట పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...