నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆదివారం పుష్పాంజలి ఘటించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ అగ్రగామిగా నిలిచారన్నారని కొనియాడారు. ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని.. రూ.2కే కిలో బియ్యం పథకం ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రరాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తనదైన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. సమాజమే దేవాలయంగా భావించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటిచెప్పిన ఏకైక నాయకుడు అని అన్నారు. రైతుకు అండగా నిలుస్తూ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికి ఆదర్శప్రాయం అని నందమూరి బాలకృష్ణ(Balakrishna) అన్నారు.
Read Also:
1. చరిత్ర NTR గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది: చిరంజీవి
2. తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటిచెప్పిన నాయకుడు ఎన్టీఆర్: Pawan Kalyan
Follow us on: Google News, Koo, Twitter