సూపర్ స్టార్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన బాలకృష్ణ

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన మహా నటుడు ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకలను టీడీపీ అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో జరిగే ఈ వేడుకలకు తమిళ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) పాల్గొననున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి ఒకే వాహనంలో వెళ్లిపోయారు. ఇకపోతే శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకాంత్‌(Rajinikanth)కి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం చంద్రబాబు, బాలకృష్ణ, రజినీకాంత్‌లు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను రజినీకాంత్ ఆవిష్కరించనున్నారు.

- Advertisement -
Read Also: వెంకటేశ్ సైంధవ్ చిత్రం నుంచి హీరోయిన్ అప్‌డేట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...