Actor Suman | ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ రాజకీయాలపై ప్రముఖ నటుడు సుమన్(Actor Suman) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని సుమన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఏపీలో బీసీ(BC Community)ల కోసం కొత్తగా రాజకీయ పార్టీ రావాల్సి ఉందన్నారు. ఏపీలో కులానికొక పార్టీ ఉందని.. బీసీలకు మాత్రం లేదన్నారు. బీసీలకు ప్రత్యేకంగా పార్టీ లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చే పార్టీకే మద్దతు ఇవ్వాలని సుమన్ పిలుపునిచ్చారు. పార్టీ మేనిఫెస్టోల్లో బీసీలకు ఏం చేస్తారో ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా పార్టీల అధినేతలు స్పష్టం చేయాలన్నారు. ఆ క్రమంలో.. మేలు చేసే పార్టీల వద్దకే బీసీలు వెళ్లాలని సూచించారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే ఏడ్చి ప్రయోజనం లేదు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని సుమన్‌(Actor Suman) గుర్తు చేశారు.

- Advertisement -
Read Also:
1. తెలంగాణలో గెలిచేది ఆ పార్టీనే.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
2. తలలో చుండ్రు తరచూ వస్తుంటే ప్రమాదమా??

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...