Bharat Jodo Yatra: ఏపీలోకి ప్రవేశించింన రాహుల్ గాంధీ

-

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటికే ఈ యాత్ర కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. కర్నూలు జిల్లా చేత్రగుడి నుంచి పాదయాత్ర మెుదలు కాగా.. పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో మెుత్తం 4 రోజులు, 119 కి.మీ మేర రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది. నేడు ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నాం లంచ్‌ బ్రేక్‌లో పోలవరం నిర్వాసితులతో రాహుల్‌ ముచ్చటించనున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైపోతున్న తరుణంలో రాహుల్‌ గాంధీ చేస్తున్న ఈ యాత్ర, పార్టీ వర్గాల్లో జోష్‌ నింపింది. ఈ ఉత్సాహంతో, పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...