Vishnuvardhan Reddy: వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి

-

Vishnuvardhan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన సాగించే వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలని, అభివృద్దే అజెండాగా పాలనను సాగించే బీజేపీ, జనసేనను ప్రజలు ఆశీర్వదించాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 18 నెలలు పాటు వైసీపీ అసమర్ధత పాలనపై నెలకొక్క మేనిఫెస్టోలో అమలు చేయని హామీని ప్రజల ముందు ఉంచుతామని.. 2024లో ప్రాంతీయ పార్టీల శకం ముగిసేలా బీజేపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని తెలిపారు.

- Advertisement -

జగన్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ధ్వజమెత్తారు. 40 నెలల వైసీపీ పాలనపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘2024లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మళ్లీ మోదీయే ప్రధాని. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యాయం ముగిసింది. 2024లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. 2024లో తిరిగి మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది’’. అని విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) ధీమావ్యక్తం చేశారు.

Read also: ఆదివాసీ ఆడపడుచుగా నాగోబా జాతరకు రండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...