Botsa Satyanarayana : 2019లో పవన్ సత్తా అర్ధమైంది.. 2024 ఎన్నికల్లో ఏం చేయగలరు

-

Botsa Satyanarayana Reacts On Janasena pawan kalyan comments in Ippatam village: పిట్టకొంచెం కూత ఘనం అన్న చందంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్ కల్యాణ్ తెలుసుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. పవన్‌‌కు కేంద్రంలో ఉన్నది పవన్ ఫ్రెండే కదా?.. వెళ్లి మాట్లాడొచ్చుగా అని ఎద్దేవా చేశారు. ఇప్పటంలో అభివృద్ది కోసం రోడ్లు విస్తరిస్తుంటే పవన్‌‌కు వచ్చిన అభ్యంతరం ఏమిటి? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పవన్ సత్తా మాకు అర్ధమైందని.. కొత్తగా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏం చేయగలరని అపహాస్యం చేశారు. ఇప్పటంలో ఏం జరిగిందో.. కోర్టు ఏం చెప్పిందో చూశామన్నారు. ఇప్పటం గ్రామానికి అభివృద్ధి అవసరం లేదా? అని Botsa Satyanarayana నిలదీశారు.

- Advertisement -

ఇప్పటంలో ఇళ్లు కూల్చి తన గుండెల్లో గునపం దింపారని జనసేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహరం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే ఏం చేయాలో నాకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం. 2024లో జనసేన అధికారంలోకి వచ్చాక లీగల్ విధానంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లు కూలుస్తాం. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతాం.’’ అని సవాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...