చంద్రబాబు విడుదలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంబరాలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కూడా బాబు విడుదలపై సంతోషం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(Arekapudi Gandhi), రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్(Prakash Goud), సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) తమ ఆనందం తెలియజేశారు.

- Advertisement -

చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో సండ్ర వెంకట వీరయ్య.. బీఆర్ఎస్ కార్యాలయంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. బాబుకు బెయిల్ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం మంచి పరిణామమని అరికెపూడి గాంధీ తెలిపారు. చంద్రబాబు కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలపుతున్నానని అన్నారు. చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని.. ఒక్క కేసు కూడా నిలబడదని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ఇక ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ 53 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే వీరంతా తెలంగాణ టీడీపీలో చంద్రబాబు(Chandrababu) శిష్యులుగా పనిచేసిన వారే కావడం గమనార్హం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

Read Also: తెలంగాణలో బీఆర్ఎస్‌దే మళ్లీ అధికారం.. తెల్చేసిన ప్రముఖ సర్వే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...