Btech Ravi | అవినాశ్ రెడ్డి కూడా అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా?.. బీటెక్ రవి సవాల్..

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) కూడా అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా? అని టీడీపీ నేత బీటెక్ రవి(Btech Ravi) సవాల్ విసిరారు. వివేకా హత్య కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్యలో తన ప్రమేయం లేదని నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటే అవినాశ్.. బీజేపీలోకి పోతాడని సునీతతో జగన్ అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

అసలు వివేకాను గొడ్డలితో చంపారన్న విషయం హత్య జరిగిన రోజునే జగన్‌కు ఎలా తెలిసిందని నిలదీశారు. ఈ కేసులో జగన్(YS Jagan) ప్రమేయం ఉందన్న విషయం త్వరలోనే బయటికి వస్తుందన్నారు. వివేకా హత్యను నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పంపారన్న సమాచారం కూడా ఉందని ఆయన(Btech Ravi) సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. మల్కాజిగిరి నుంచి ఎవరంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...