అచ్యుతాపురంలో ఫార్మా సంస్థ ఎసెన్షియాలో జరిగిన ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) స్పందించారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది మరణించడం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు. ‘‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పటికే సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేశాం. కంపెనీ నుంచి బాధితులకు అందాల్సిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తరపున కూడా పరిహారం అందిస్తాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. వారికి అందించే వైద్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. చిట్టచివరి బాధితుడి వరకు న్యాయం జరిగేలా చర్యలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. బాధితులను సీఎం చంద్రబాబు ఈరోజు పరామర్శించనున్నారు’’ అని చెప్పారు.