ఆ కేసులో ఏ1గా చంద్రబాబును చేర్చిన సీఐడీ

-

case files on Chandrababu and AP CID enters his name as A1: అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఏపీ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబును పేర్కొన్నారు. ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్‌, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్‌, ఏ6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌‌ను సీఐడీ (AP CID) చేర్చింది. అలైన్‌మెంట్‌ మార్పుల పేరిట రామకృష్ణ హౌసింగ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, లింగమనేని అగ్రికల్చర్‌ ఫామ్స్‌, జయని ఎస్టేట్స్‌కు లబ్ధి చేకూర్చినట్లు ఆళ్ల రామకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

అయితే ఇప్పటికే, మాజీ మంత్రి నారాయణను హైదారాబాద్‌లోని ఆయన నివాసంలోనే సీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నారాయణ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. ఆయనను అతడి ఇంటి వద్దనే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశానుసారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని ఓ అపార్టుమెంటులో ఉంటున్న నారాయణ వద్దకు వెళ్లిన సీఐడీ పోలీసులు.. అక్కడే విచారణ చేపట్టారు. ఉదయం 11:30 నుంచి విచారణ చేపట్టి 1 గంట వరకు.. పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. అనంతరం తిరిగి మధ్యాహ్నాం 2 గంటలకు విచారణ పునఃప్రారంభించారు. ఐదింటి వరకు ఈ విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...