ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహిళల మిస్సింగ్ డేటా(Missing Women Data) ఇప్పుడు సంచలనంగా మారింది. 2019 నుండి 2021 నుండి దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు మిస్సింగ్ డేటా బుధవారం కేంద్ర హోంశాఖ పార్లమెంటులో వెల్లడించింది. మూడేళ్ళలో భారతదేశంలో 12లక్షల 18 వేల 184 మంది మహిళలు, బాలికలు మిస్ అయినట్లు గణాంకాలు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో తెలంగాణ 10వ స్థానంలో, ఏపీ 15 స్థానంలో ఉన్నట్లు తేల్చింది.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2019-2021 వరకు 34,495 మంది మహిళలు, 8,066 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019-2021 వరకు 22,278 మంది మహిళలు, 7,918 మంది బాలికలు అదృశ్యమయ్యారు. 2019 నుండి 2021 భారతదేశంలో మొత్తం 9,87,009 మంది మహిళలు (18 ఏళ్లు పైబడినవారు), 2,26,175 మంది బాలికలు అదృశ్యమయ్యారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
మూడేళ్ళలో ఏపీ, తెలంగాణ లలో మిస్సింగ్(Missing Women Data) కేసుల వివరాలు:
18 ఏళ్ల లోపు బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించిన డేటా సంవత్సరాల వారీగా ఇలా ఉంది.
2019 నుండి 2021 వరకు మూడు ఏళ్లలో ఏపీ లో మొత్తం 7928 బాలికలు, 22278 మహిళలు మిస్ అయ్యారు.
2019 లో ఏపీ నుండి 2,186 బాలికలు 6,252 మంది మహిళల మిస్సింగ్ కేసులు.
2020 లో ఏపీ నుండి 2,374 బాలికలు 7,057 మంది మహిళల మిస్సింగ్ కేసులు.
2021 లో ఏపీ నుండి 3,358 బాలికలు 8,969 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 2019 నుండి 2021 వరకు మూడు ఏళ్లలో మొత్తం 8066 మంది బాలికలు, 34495 మహిళలు మిస్ అయ్యారు.
2019 లో తెలంగాణ నుండి 2,849 మంది బాలికల 10,744 మహిళల మిస్సింగ్ కేసులు.
2020 లో తెలంగాణ లో 2,232 మంది బాలికల 10,917 మంది మహిళల మిస్సింగ్ కేసులు.
2021 లో తెలంగాణ లో 2,994 మంది బాలికల 12,834 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
కాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. “మహిళల మిస్సింగ్ కేసుల వివరాలు నిశితంగా పరిశీలిస్తే మన ఆంధ్రప్రదేశ్‌లో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలియజేస్తుంది. మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏమి జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ వచ్చి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా? ఏపీ మహిళా కమిషన్ హోంశాఖ, డీజీపీని వివరణ కోరుతుందా? అంతిమంగా ఏపీ మహిళా కమిషన్ చర్యలు తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా? దీనిపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని జనసేనాని డిమాండ్ చేశారు.
Read Also: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సర్కార్ కీలక ప్రకటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat