అమరావతికి 15 వేల కోట్లు..

-

Amaravati |కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా అమరావతి(Amaravati) అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సహాయం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాలను బట్టి అదనపు నిధులు కూడా కేటాయిస్తామని కూడా ప్రకటించారామే. దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పోలవరం పూర్తి ద్వారా దేశంలోని ఆహార కొరతను నియంత్రించవచ్చని ఆమె తెలిపారు.

- Advertisement -

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి కూడా ప్రత్యేక సహకారం అందించనున్నట్లు ప్రకటించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సహాయం అందిస్తామని, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. దీంతో పాటుగా ఏపీలో వెనకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు అందిస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామని నిర్మల(Nirmala Sitharaman) తెలిపారు. దాంతో పాటుగా పూరోవదయం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాజెక్ట్ కేటాయించినున్నట్లు కూడా తెలిపారు.

Read Also: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...