ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో తన తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Sidharth Luthra) కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరుకానున్నారు. రేపు సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు.

- Advertisement -

స్కిల్ డెవలప్మెమెంట్ కేసు(Skill Development Case)లో సెప్టెంబరు 9న చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 52రోజులు తర్వాత ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ తర్వాత నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. హైదరాబాదులో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం చంద్రబాబు(Chandrababu) బయటికి రావడం ఇదే తొలిసారి. ఇక ఈనెల 29 నుంచి చంద్రబాబు పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.

Read Also: అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తా.. లోకేశ్‌ వార్నింగ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gama Awards | దుబాయిలో గ్రాండ్‌గా ‘గామా’ అవార్డ్స్ వేడుక.. ట్రోఫీ లాంచ్..

Gama Awards |దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా...

Delhi Liquor Scam | లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ..

ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది....