ఈరోజు గురుపూర్ణిమ(Guru Purnima) మహోత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో గణంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గురువులను పూజించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు(Chandrababu) కూడా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్బంగానే రాష్ట్ర ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యాన్ని ఏర్పరుచుకోవాలని, వేదవ్యాసుడి ఉపదేశాన్ని అందరూ పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో ఉండాలని సూచించారు.
గురువు అంటే మనకు బడిలో కేవలం పాఠాలు చెప్పే వ్యక్తే కాదని అన్నారు. గురువు చెప్పే ప్రతి పాఠం కూడా అది పాఠ్యపుస్తకంలోనిది అయినా, జీవిత సంబంధితమైనదైనా మన భవిషయత్తును నిర్దేశిస్తుందని, ప్రతి వ్యక్తి జీవితంలో గురువు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రి తర్వాత వారి శ్రేయస్సు కోరేది ఒక్క గురువేనని, అటువంటి గురువును, మన జీవిత మార్గదర్శకుల పట్ల ఎప్పుడూ గౌరవ భావంతోనే ఉండాలని Chandrababu వివరించారు.