అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. ఆ సమస్యలపైనే చర్చ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రకు సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు, అంశాలపై కూడా వారు మాట్లాడుకున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన క్రమంలో ఆంధ్రకు పలు సమస్యలు ఎదురయ్యాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వాటిని పరిస్కరించడానికి కేంద్రం సహాయం చేయలని చంద్రబాబు కోరినట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అందుకు అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు అంశాలపై అమిత్ షా ప్రశ్నించారని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అయితే రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసమే తాను ఢిల్లీ వెళ్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో ఉందని, అన్ని వ్యవస్థలు నిర్వీర్య స్థితిలో ఉండటంతో కూటమి ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఈ సవాళ్లు ఎదుర్కోవాలంటే కేంద్రం సహాయం ఎంతైనా అవసరం ఉందని, ఈ అంశాలపై చర్చించడానికే తాను ఢిల్లీకి వెళ్తున్నానని, అంతేకాకుండా పలు కీలక ప్రాజెక్ట్‌లకుక కావాల్సిన నిధులను కూడా కోరనున్నట్లు కూడా చెప్పారు చంద్రబాబు(Chandrababu). అదే విధంగా అమిత్ షా‌(Amit Shah)తో జరిగిన భేటీలో రాష్ట్రానికి కావాల్సిన నిధులను గురించి కూడా చర్చించినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

Read Also: రఫ్ఫాడిస్తున్న ‘రాయన్’ ట్రైలర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...