సీఎం జగన్‌ కు చంద్రబాబు సవాల్.. 48 గంటల డెడ్‌ లైన్.. 

-

సీఎం జగన్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇసుకాసురుడు పేరుతో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీకి జగన్ పాల్పడినట్లు ఆరోపించారు. 2022 నుంచి వైసీపీ నేతలకే ఇసుక దందా అప్పగించారని విమర్శించారు. ఇసుకలో వాటాల నిబంధనలు ఉల్లంఘించారని.. వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అనధికారికంగా 500కు పైగా ఇసుక రీచ్‌లలో దోపిడీ చేశారని… ఇసుకను నల్లబజారులో (బ్లాక్ మార్కెట్) అధిక రేటుకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. నీరు ఉన్న చోట ఇసుకను తవ్వకూడదనే నిబంధన ఉందని.. అయినా కృష్ణా నదిలోనూ రోడ్లు వేసి ఇసుకను తవ్వేశారన్నారు.

- Advertisement -

ఇసుక మాఫియాకు, మోసాలకు ఎందరో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమరాజ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని.. రాజమండ్రిలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేశారని గుర్తు చేశారు. ఇసుక మాఫియాపై ప్రశ్నించే వారిని పలు రకాలుగా వేదించారు. ఎన్జీటీకి వెళ్లిన వారి ఆస్తులపై దాడులు, తప్పుడు కేసులు పెట్టారని మండి పడ్డారు. ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు జగన్‌ కు 10 ప్రశ్నలు వేశారు. 48 గంటల సమయం ఇస్తున్నామని ఈ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

1. ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక తవ్వింది ఎంత… ప్రభుత్వ ఆదాయం ఎంత?

2. జీఎస్టీ ఎంత చెల్లించారు… ఏ సంస్థ పేరున చెల్లించారు?

3. రాష్ట్రంలో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాలు ఎన్ని… వాటిల్లో ఉన్న నిల్వలు ఎంత?

4. పర్యావరణ అనుమతులు ఉన్న ఇసుక రీచ్ లు ఎన్ని? ఎన్ని మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది?

5. ఎన్జీటీ ఆదేశాలను అనుసరించి ఎస్ఈఐఏఏ ఈసీలను రద్దు చేయడం నిజం కాదా?

6. ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే ఇచ్చేందుకు నిరాకరించలేదా?

7. ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయడంలేదని వేసి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లో ప్రభుత్వాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది వాస్తవం కాదా?

8. కమీషన్ రూపంలో ప్రతి నెలా రూ.35 కోట్లు చెల్లించలేక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమరాజ్ ఆత్మహత్య నిజం కాదా?

9. ఒప్పందాలు లేకపోయినా రాష్ట్రంలో నేడు ఇసుక తవ్వకాలు చేస్తుంది ఎవరు?

10. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దోపిడీపై 48 గంటల్లో సమాధానం చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...