Chandrababu naidu meets NITI aayog ceo parameswaran Iyer: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ సూచన మేరకు ఆయన నీతి ఆయోగ్ సీఈఓ ని కలిశారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ నోట్‍ను పరమేశ్వరన్‍కుఅందించారు చంద్రబాబు. ప్రతిష్టాత్మక G-20 దేశాల కూటమికి భారత్ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు నిర్వహణపై సోమవారం ప్రధాని అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. దేశ భవిష్యత్ ప్రయాణానికి వచ్చే పాతికేళ్ళకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలని బాబు సూచించారు.
డిజిటల్ పరిజ్ఞానంపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని.. అయితే వచ్చే పాతికేళ్లలో ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా అవతరించేందుకు వీలుగా విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని అభిప్రాయప డ్డారు. మన దేశ మానవ వనరుల శక్తి అపారమని, దానిని నాలెడ్జ్ ఎకానమీతో అనుసంధానిస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. చంద్రబాబు(chandrababu naidu) ఆలోచనతో ఏకీభవించిన మోడీ.. ఈ విషయంపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. డిజిటల్ పరిజ్ఞానంపై చంద్రబాబు చెప్పిన మాటలు విన్నానని, విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. అనంతరం డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‍పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు మోదీ సూచించారు. ఈ క్రమంలోనే మంగళవారం చంద్రబాబు నీతి ఆయోగ్ సీఈఓ తో భేటీ అయ్యారు.