వైఎస్ వివేకానంద హత్య కేసుపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు.. దేశ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్. ఫిక్షన్ అని కథలు రాసే వారు కూడా ఇలాంటివి రాయలేరని చెప్పారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి కేసు పోతే.. వ్యవస్థల మీద నమ్మకం పోతుందని చంద్రబాబు(Chandrababu Naidu) తెలిపారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను జగన్(Jagan) దెబ్బ తీశారని దానిని అధికారంలోకి వచ్చి దానిని సరిచేస్తామని తెలిపారు. అంతేగాక, వైసీపీ(YCP)లోని చాలామంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని.. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం అని చెప్పారు.
Read Also: అనిల్‌కు మంత్రి పదవి రావడానికి అదొక్కటే కారణం: మేకపాటి
Follow us on: Google News, Koo, Twitter