టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. కాసేపట్లో విజయవాడకి తరలింపు 

-

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో జరిగిన అవినీతి కేసులో చంద్రబాబును ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు రోడ్డు మార్గాన తీసుకువస్తున్నారు. మంగళగిరిలోని సీఐడీ ఆఫీస్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

- Advertisement -

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడిక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలను బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అరెస్టును రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...