Bobbili TDP: బొబ్బిలి పసుపుమయం.. బాబు ప్రసంగం హైలైట్స్ ఇవే!!

-

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా రావడంతో ఆ ప్రాంతమంతా పసుపుమయం అయ్యింది. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల అవినీతిపై మండిపడ్డారు. ఆయన ప్రసంగం హైలైట్స్ ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.

- Advertisement -
ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు నాయుడి కామెంట్స్:

• నేను బొబ్బిలికి రావడం ఇదేమీ కొత్త కాదు…నేను సినిమా నటుడుని కాదు…కానీ ఈ జన సందోహం ఎందుకు వచ్చింది. ఇంతటి సభను ఎప్పుడూ చూడలేదు.
• శివుడు భస్మాసురుడుని నమ్మినట్లు…మీరు ఒక్క ఛాన్స్ కు పడి పోయి జగన్ రెడ్డిని నమ్మారు.
• ఇప్పుడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు… దీనికి ఒకటే మార్గం జగన్ రెడ్డిని ఓడించడం.
• ఎమ్మిగనూరు నుంచి చూస్తున్నా ఎక్కడ చూసినా జనమే జనం.
• నాకు మీటింగ్ లు కొత్త కాదు…కానీ స్పందన చూస్తే నాకే హుషారొస్తోంది.
• దారిలో పిల్లలు, యువకులు తరలివస్తున్నారు.
• యువత నీరాజనం పలుకుతున్నరు.
• మా భవిష్యత్ కాపాడాలని పిల్లలు కోరుకుంటున్నారు
• ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు
• డీజీపీ ఒక్క సారి టీవీ చూడు….మీరు ఈ జనాన్ని కంట్రోల్ చేస్తారా.?
• బొబ్బిలి సభ చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుస్తోంది.
• ఇక్కడ ఉన్న పోలీసులను అడుగుతున్నా మీ బకాయిలు ఇచ్చరా…మీ జీపీఎఫ్ లు ఇచ్చాడా.?
• అన్ని వర్గాలకు ఇప్పుడు ఇదేం ఖర్మ..?
• జగన్ రెడ్డి నేను ఎక్కడ ఉంటాను అని అడుగుతున్నాడు.?
• ఈ బొబ్బిలి కోటలో చూడు….ప్రజల హృదయాల్లో ఉంటా..వాళ్ళ మనసుల్లో ఉంటా.
• తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చాను.
• తెలుగువారు అమెరికాలో ఉన్న, తమిళనాడులో ఉన్నా, తెలంగాణలో ఉన్నా వాళ్ళతోనే ఉంటా.
• ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఉంటా. జగన్ రెడ్డి ఇదే నా సమాధానం. (వీడియో లింక్ కింద ఉంది చూడవచ్చు)

• జగన్ రెడ్డి నా రాజకీయ అనుభవమంత లేదు నీ వయసు. నీ నాన్న కూడా తోక తిప్పలేదు.
• మీరు రాజకీయం చేస్తే నేనూ రాజకీయం చేస్తా…
• ప్రజల ఆస్తులు, వారి భవిష్యత్ ముఖ్యం నాకు.
• రాష్ట్రంలో ఇసుకకు రెక్కలు వచ్చాయి.
• తాడేపల్లి ప్యాలెస్ కాదు….అది నకిలీ ప్యాలెస్.
• బాదుడే బాదుడుతో పన్నులు వేస్తే ప్రజలు నాడు ప్రశ్నించలేదు. ఇప్పుడు బాదుడు దెబ్బకు ఇక బయటకు వస్తున్నారు
• పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఎక్కువ
• కరెంట్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి.
• నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
• ఇంటిపన్ను, చెత్త పన్ను తో బాదేస్తున్నారు.
• చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం ఈ జగన్.
• అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఈ కార్యక్రమం తెచ్చాను.
• నిన్న కేంద్ర మంత్రి అన్నారు…ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు గానీ…పేపర్ లో ప్రకటనలు ఇచ్చుకుంటారని.
• నా మీటింగ్ ఫెయిల్ అని సాక్షి వాళ్ళు రాస్తున్నారు..వాళ్ళు అసాక్షి.
• సాక్షితో పాటు టీవీ9, NTV అనేవి బ్లూ మీడియా.
• వాళ్లకు సమస్యలు కనపడవు. ప్యాకేజీలు మాత్రమే కనిపిస్తాయి.
• బుద్ది ఉంటే ఈ సీఎం ఇకనైనా మారాలి.
• వీలైనంత తొందరగా వైసీపీని కాంక్రీట్ తో సమాధి చెయ్యాలి
• అన్న క్యాంటీన్ నిలిపివేశారు…ఇక్కడ బేబీ నాయన భోజనం పెడతాను అంటే వద్దు అంటాడు ఈ సీఎం.
• రూ.200 పించన్ ను రూ.2000 చేసింది టీడీపీనే.
• మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే రూ.3000 ఇచ్చే వాళ్ళం
• ఈ జగన్ ఒక్క ఇల్లు కట్టడా? టిడ్కొ ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు..?
• ఇళ్లకు రంగులు వేసుకున్నాడు..కానీ ఇళ్ళు ఇవ్వలేదు.
• జగన్ రెడ్డి మూడున్నరెళ్ళలో 5 ఇళ్ళు కట్టాడు. ఈ మాట కేంద్రమే పార్లమెంట్ లో చెప్పింది.
• నీ సిగ్గు అనిపించలేదా జగన్.
• చంద్రన్న బీమా లేదు, విదేశీ విద్య లేదు…ఏమయ్యాయి ఈ పథకాలు.?
• రాష్ట్రంలో ఇప్పుడు రూ 9.50 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు ఎవరు కడతారు.?
• ఈ అప్పులు మన ఆదాయం అంతా సరిపోతుందా.?
• రైతు బజారు, తహసీల్దార్ ఆఫీస్ తాకట్టు పెట్టిన సీఎం జగన్. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు
• నాడు మద్యపాన నిషేదం అన్నాడు…ఇప్పుడు డబ్బులు తప్ప..ఆన్లైన్ చెల్లింపులు లేవు.
• ఉత్తరాంధ్రపై జగన్ కు ప్రేమలేదు….అస్తులపైనే ప్రేమ.
• దస్పల్లా భూములు ఎవరు కొట్టేశారు..?
• రుషికొండను బొడి గుండు చేశారు.
• నేను రుషికొండకు వెళ్తాను అని నిన్న రోడ్లు మూసేసాడు.
• సాక్షి గుమస్తా ఒకరు ఉన్నారు…రుషికొండ అంతర్జాతీయ సమస్యా అంటాడు.?
• కొండలు గుట్టలు కొట్టేస్తుంటే మనం వదిలి పెట్టాలా.?
• విశాఖలో ఉన్న అన్ని పరిశ్రమలు, పెట్టుబడులు పోయాయి.
• లులూ, అదాని సహా అన్నీ పోయాయి.
• ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.
• అమరావతి రాజధాని, విశాఖ వాణిజ్య రాజధాని అవ్వాలి.
• నేను ప్రతిపాదించిన భోగాపురం విమానాశ్రయం ఏమయ్యింది..?
• ఒక్క పరిశ్రమ రాలేదు..ఉన్నవి అన్నీ మూత పడ్డాయి.
• యువతకు ఉద్యోగాలు లేవు….జాబు రావాలి అంటే బాబు రావాలని యువత కోరుకుంటోంది.
• అమరావతిలో మూడు లక్షల కోట్ల సంపద బూడిద పాలయ్యింది.
• అమరావతి రైతులు రోడ్డున పడటం రాష్ట్రానికి మంచిదా.?
• పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన ఘనత ఎవరిది.?
• ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఏమయ్యింది…ఎందుకు మూత పడింది.?
• సైకో సీఎం వల్ల షుగర్ ఫ్యాక్టరీ పోయిందని రైతులు చెప్పారు.
• రాష్ట్రం అన్ని రంగాలలో దెబ్బతింది.
• ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చింది ఎన్టీఆరే.
• డ్వాక్రా సంఘాలు పెట్టింది నేను. దీంతో వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి.
• ఆడపిల్లలకు మంచి అవకాశాలు ఇచ్చాను. రాబోయే రోజుల్లో వారికి రక్షణ గా నిలిచేది మనమే
• ఉద్యోగస్తులు భయపడ్డారు..పీఆర్సీ లేదు.
• నెలలో 23వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వడం లేదు.
• జీతాలు ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతాడా?
• విశాఖను గంజాయికి హబ్ గా చేసాడు..ఇది చాలా ప్రమాదం. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి.
• ఎక్కువ గంజాయి పట్టుకున్న రాష్ట్రం ఏపీ అని కేంద్రం చెప్పింది.
• పోలీసులు మాపై కాదు…సంఘ విద్రోహ శక్తులపై పోరాడాలి. గంజాయి, డ్రగ్స్ వల్ల ఆడపిల్లలపై దాడులు పెరిగాయి.
• ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రవాటా కేవలం వెయ్యికోట్ల..అదే తెలంగాణలో రూ.1.80 లక్షల కోట్లు ఉంది.
• ఈ సారి ఎన్నికల్లో ప్రజలు గెలవకపోతే రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలు. నాకు కాదు…రాష్ట్రానికే నష్టం.
• సమయం లేదు మిత్రమా…ప్రజా చైతన్యం రావాలి. రాష్ట్రంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మలు ఏంటి?
• సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మలు ఏంటి? జగన్ కు ఫోటో పిచ్చి…రంగుల పిచ్చి పట్టింది. కేంద్రం జగన్ ను పిలిచి భారత్ రత్న ఇవ్వాలి ఇలాంటి దిక్కుమాలిన పనులకు.
• సర్పంచ్ లకు రాష్ట్రం లో విలువ లేదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాసాడు.
• నా పర్యటనలో అనేక మంది వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. అనేక రంగాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు
• రాష్ట్రంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. కమీషన్ల కోసం చిన్న చిన్న వ్యాపారులను బెధరిస్తున్నారు.
• మనం వచ్చిన తరువాత స్వేచ్చగా వ్యాపారాలు చేసుకోవడానికి మంచి వాతావరణం కల్పిద్దాం.
• మూడున్నరేళ్ల తర్వాత అవినీతి చేయొద్దని మొన్న మంత్రులకు కేబినెట్ మీటింగులో జగన్ చెప్పాడు
• అంబటి రాంబాబు బాధితుడికి ఇచ్చిన రూ.5 లక్షల చెక్కులో సగం వాటా అడిగాడు. అంబటి పై చర్యలు తీసుకునే దైర్యం ఉందా ఈ సీఎంకు?
• కర్నూలులో మంత్రి జయరాం పేదల భూములు కొట్టేశాడు. ఇప్పుడు డబ్బులు కడితే వాళ్లకు తిరిగి భూములు ఇస్తాను అంటున్నాడు
• ఈ నియోజకవర్గం లో ఒక షాడో ఎమ్మేల్యే ఉన్నాడు…ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అవినీతి చేస్తున్నాడు
• బొబ్బిలిలో ఎమ్మెల్యే 1000 అడుగుల స్థలాన్ని కూడా వదలకుండా కొట్టేశాడు.
• జగన్ బటన్ నొక్కుడు కాదు…మొత్తం బొక్కుడే.
• ఉత్తరాంధ్ర లో సాయిరెడ్డి, సుబ్బా రెడ్డీ పెత్తనం ఎంటి?
• బొత్స, ధర్మాన ఎందుకు అడగలేకపోతున్నారు?
• రాష్ట్రంలో పెత్తనం అంతా సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డీ, పెడ్డిరెడ్డిలదే
• రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించడం సామాజిక న్యాయమా.?
• పేదలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం…. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చుతా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...