Chandrababu Tour :అప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడి గుద్దులు: చంద్రబాబు

-

Chandrababu Tour in West Godavari fires on cm jagan in kovvuru: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన మూడో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొవ్వూరులో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్‌ అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ముద్దులు పెడితే.. ఏదో ఉద్ధరిస్తాడని ఒక్కసారి ఛాన్స్‌ ఇచ్చి ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

అప్పుడు మహిళలకు ముద్దులు పెట్టి.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని దుయ్యబట్టారు. డ్వాక్రా సంఘాల మహిళలను సీఎం సభలకు తరలించేందుకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను సీఎం సభలకు తరలించి, జగన్‌ రెడ్డి సభల్లో చప్పట్లు కొట్టకపోతే.. పెన్షన్లు, అమ్మఒడి ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా మహిళలు చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా సంఘాల స్వయం సాధికారతను జగన్ దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్‌ మాటలు కోటలు దాటుతుంటే.. అమలు మాత్రం గడప కూడా దాటడం లేదని విమర్శలు గుప్పించారు.

మహిళలను ఎవరు పైకి తీసుకువచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోవాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పనులను ఎండగట్టడంలో డ్వాక్రా మహిళలు ముందుండాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆడవారి ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు ఇస్తే.. జగన్‌ వాటిపై పన్నులు వేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

నేలపై కూర్చొని.. కార్యకర్త సమస్య విన్న చంద్రబాబు
Chandrababu Tour లో భాగంగా కొవ్వూరు వచ్చిన ఆయనను కలిసేందుకు తాళ్లపూడి నుంచి వచ్చిన దివ్యాంగ కార్యకర్త శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ పక్కనే చంద్రబాబు కింద కూర్చొని అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలియోతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. మెుక్కవోని దీక్షతో పార్టీ కోసం శ్రీనివాస్‌ కష్టపడుతున్నట్లు ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు చంద్రబాబుకు ఈ సందర్భంగా వివరించారు. సమస్యలకు కుంగిపోవద్దనీ, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు శ్రీనివాస్‌కు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు శ్రీనివాస్‌కు భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

RGV | పరారీలో రాంగోపాల్ వర్మ..!

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ(RGV) ప్రస్తుతం పరారీలో ఉన్నారంటూ వార్తలు...

Rashmika | పెళ్ళిపై స్పందించిన రష్మిక..!

‘పుష్ఫ-2’ మూవీ ఈవెంట్‌ను చెన్నై వేదికగా ‘వైల్డ్ ఫైర్’ నిర్వహించారు మేకర్స్....