ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Thammineni Seetharam) టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఉద్ధరించటానికి చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరిలో బ్లాక్ కమాండోస్ భద్రత ఇచ్చారని కేంద్రాన్ని ప్రశ్నించారు. కమాండోలను తీసివేస్తే బాబు ఫినిష్ అయిపోతారని వారు ఉన్నారన్న ధైర్యంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. శాసన సభాపతిగా బాబు భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తానని వ్యాఖ్యానించారు. దేశంలో చాలా మంది నేతలకు హెచ్చరికలు, ముప్పు పొంచి ఉందని.. వారందరికీ ఇలానే భద్రత కల్పిస్తున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు(Chandrababu) ఏమైనా వ్యవస్థలకు అతీతుడా? అని నిలదీశారు. తమ్మినేని(Thammineni Seetharam) వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. స్పీకర్ స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిని మేనిఫెస్టో ప్రకటనతో వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
కమాండోస్ లేకపోతే చంద్రబాబు అయిపోతారు: స్పీకర్ తమ్మినేని
-