Cherukuwada village uncovering the family: కుల బహిష్కరణ నేరమనీ, కుల బహిష్కరణ పాటిస్తే శిక్షార్హులు అవుతామని తెలిసినా నేటికీ ఇంకా పలు చోట్ల అలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ (Cherukuwada village)లో ఓ కుటుంబన్ని వెలివేసి (uncovering the family) ఆంక్షలు విధించారు. చేరుకువాడ గ్రామ సంఘం పెద్దలు వెలివేసిన కుటుంబంతో ఎవరైన మాట్లాతే.. 5వేలు జరిమానా వేస్తామని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. చెరుకువాడకి చెందిన రాణి ఆకివీడుకి చెందిన సతీష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా.. సంఘ పెద్ద కనకారావు సతీష్, రాణిలను కులాంతర వివాహం చేసుకున్నారని ఈ వివాహం తమకు ఇష్టం లేదని వెదించేవాడు. సతీష్‌ని కూడా..రాణీ ఇంటికి రావద్దని హెచ్చారించేవాడు. గతంలో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు సంఘ పెద్దలకు, రాణి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా.. సంఘం పెద్దల నుంచి కొన్ని రోజులగా వేధింపులు ఎక్కువ కావడంతో.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘ పెద్దలు కనకారావు, మధు, మోహన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .