Chiranjeevi about Pawan Kalyan: పవన్ పై విమర్శలు.. వారిని కలిసేందుకు బాధగా ఉందన్న చిరంజీవి

-

Chiranjeevi interesting comments on pawan kalyan:మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ హీరో రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై మరోసారి స్పందించారు. ప్రత్యర్థులు జనసేన అధినేత పర్సనల్ లైఫ్ గురించి రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

- Advertisement -

తమ్ముడిపై వచ్చే విమర్శలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ పై కొంతమంది వ్యక్తులు చేసే విమర్శలు వింటుంటే మనసుకు చాలా బాధగా ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ ను విమర్శించిన వాళ్లే మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లు, పేరంటాలకు పిలుస్తుంటారని తెలిపారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పవన్ ను తిట్టే వారిని కలవాల్సి వస్తున్నందుకు బాధగా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ తనకు బిడ్డలాంటివాడని చెప్పారు. డబ్బు, పదవులపై ఎలాంటి వ్యామోహం అతనికి లేదు, ఉండదని నొక్కి చెప్పారు. చిన్నప్పటినుంచి సామాజిక బాధ్యతలు మరువలేదని తెలియజేశారు. శత్రువులైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోతాడని అన్నారు. ఎప్పటికైనా పవన్ అనుకున్న రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...