Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని… జీవితంలో తాను అనుకున్నవి సాధించాలని కోరుకుంటానని పేర్కొన్నారు. తమ్ముడు రాజకీయంగా ఎదగాలని తమ కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

కాగా గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ పద్మవిభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్స్, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరి వల్లే తనకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వచ్చిందని తెలిపారు. అలాగే దివంగత నటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...