Chit fund companies across the ap state: ఏపీలో చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు చేస్తున్నారు. చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బు చిట్స్‌ఫండ్‌యేతర కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపధ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా.. డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసినట్టుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. చిట్స్‌కు సంబంధించిన రికార్డులు, ఖాతాలను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం
- Advertisement -