పార్టీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి.. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు

-

పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి(Mangalagiri TDP Office) సీఐడీ నోటీసులు జారీ చేసింది. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందజేశారు. ఈనెల 18లోగా పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ… ఇందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. స్కిల్ నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అనుమానిస్తోంది.

- Advertisement -

Mangalagiri TDP Office |చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ జరగనున్న సమయంలో ఈరోజు సీఐడీ నోటీసులు ఇవ్వడం కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి రూ.27 కోట్లు వచ్చినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల చంద్రబాబును అరెస్ట్ చేయగా దాదాపు 52 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అక్టోబర్ 31న హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు.

Read Also: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...