Monkeypox Test Kit | దేశంలో మంకీపాక్స్ కేసులు అధికం అవుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తు చర్యలు చేపడుతోంది. ఎక్కడిక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. మంకీపాక్స్‌ను వ్యాప్తి చెందకు చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు మంకీపాక్స్ టెస్ట్ కిట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ మెడ్ టెక్ జోన్‌లో ఆర్టీపీసీఆర్‌ను కిట్‌ను అభివృద్ధి చేశారు. ఇది నిజంగా అభినందనీయమైన అంశమని అన్నారు. ఈ కిట్స్‌ను ప్రజలకు అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని, వీటి ధరను కూడా అందరికీ అందుబాటులోనే ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఈ ఆర్టీపీసీఆర్ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం కూడా లభించినట్లు వారు ప్రకటించారు.
Monkeypox Test Kit | మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రావడానికి ఈ కిట్ తొలిమెట్టులా ఉపయోగపడుతుందని, మెడ్ టెక్ జోన్‌కు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందుతుందని హామీ ఇచ్చారు. దీంతో పాటుగానే వినియోగదారులకు ఆర్థికభారం లేకుండా అతి త్వరలోనే సోలార్ పవర్‌తో నడిచే ఎలక్ట్రానిక్ వీల్‌చైన్‌ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతనిధులు సీఎంకు వివరించారు. ఈ సందర్బంగా తక్కువ ధరతో మన్నికైన వైద్య పరికరాలు తయారు చేయాలని, అందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.